‘ప్రియమణి’ ఒకే నా..!

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలపై భారీగా అంచనాలను రాజమౌళి రేకెత్తిస్తూండటంతో పెద్దగా వైర్‌ల్‌ అవుతుంది. అందులోనూ ఎన్టీఆర్‌, చెర్రీల కాంబినేషన్‌తో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. అయితే.. ఇప్పుడు ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాలో ఏఏ హీరోయిన్లను తీసుకుంటారో అని ఇప్పుడు హైప్‌ పెరుగుతుంది.

కాగా.. ఈ క్రేజీ చిత్ర షూటింగ్ గత ఏడాది నవంబర్ లోనే ప్రారంభం అయింది. రెండవ షెడ్యూల్ కూడా షూటింగ్ జరుగుతుండటంతో రాజమౌళి చిత్ర కాస్టింగ్, హీరోయిన్లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ సినిమాలో ప్రియమణిని మూడవ హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు వార్తలు షికార్లు కొడుతున్నాయి. ఈ పాత్ర సినిమాలో అత్యంత కీలకమైనది కాబట్టి సీనియర్‌ హీరోయిన్లపై కన్నేసినట్లు తెలుస్తోంది.

leave a reply