బంగాళదుంపతో బరువు తగ్గుదల..

చాలా మంది హెల్దీగా అండ్‌ ఆక్టీవ్‌గా ఉండటానికి ఇష్టపడతారు. హెల్దీగా ఉండటానికి చాలా ప్రయత్నాలు ఎన్నో రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. కూరగాయాల్లో చాలా పుష్కలమైన విటమిన్స్‌ దొరుకుతాయని కూడా మనకు తెలుసిన విషయమే. అలా బంగాళదుంపలో కూడా బరువును తగ్గించే పోషకాలు ఉన్నాయని మీకు తెలుసా..?

బంగాళదుంపలు ఆరోగ్యానికి హానికరమని, దానిలో కొవ్వు నిల్వలు అధికంగా ఉంటాయని చాలా మంది నమ్మిక. కానీ మీకు తెలుసా..? బంగాళదుంపలు బరువు నియంత్రణకు ఎంతగానో.. సహకరిస్తుందని, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచగలదు. బంగాళదుంపను ఏ విధంగా తీసుకున్నా.. మనకు అన్ని పోషకాలు లభిస్తాయని ఆహార నిపుణులు సైతం చెప్తున్నారు. అధిక బరువు కలిగిన వ్యక్తులు తరుచుగా బంగాలదుంపను తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు కనిపిస్తాయి.

బంగాళ దుంపలు జీవక్రియల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి కూడా. అందుచేత అధిక బరువుతో కూడుకుని ఉన్న పిల్లలకు, వారి ఆహార ప్రణాళికలలో భాగంగా బంగాళాదుంపను ఉండేలా చూసుకోవడం మంచి విషయంగా సూచించడమైనది. ఇవి శరీరాన్ని రోజంతా చురుకుగా ఉండేలా శక్తిని అందిస్తుంది. అలాగే.. బంగాళాదుంపల్లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు నష్టాన్ని ప్రోత్సహించడంలో కీలకపాత్రను పోషిస్తాయి. ఫైబర్ అధికంగా ఉన్న ఆహార పదార్ధాలు మీ కడుపును నిండినట్లు ఉంచడం మూలంగా తరచుగా ఆహారం మీదకు ద్యాస వెళ్ళకుండా చేయగలుగుతుంది.

బంగాళా దుంపలు అధిక కొవ్వు పదార్ధాలను కలిగి ఉంటాయని, అవి తింటే ఊబయానికి దారితీస్తుందని అపోహలు ఉన్నాయి. కాని, ఇందులో ఉండే కొవ్వు పదార్ధాలు వాస్తవానికి ఆరోగ్యకరమైనవి, మరియు మీ శరీరానికి అత్యంత అవసరమైనవి. ఇందులో కొవ్వు పదార్థాలే కాకుండా, విటమిన్ సి, విటమిన్ B6 మరియు పొటాషియం నిల్వలు కూడా అధికంగా ఉంటాయి. కానీ ఏ ఆహారమైనా అతిగా తీసుకుంటే నష్టాన్నే మిగులుస్తాయి. కావున, ఒక ప్రణాళికాబద్దంగా సరైన మోతాదులలోనే శరీరానికి అందించాల్సినవి ఉంటాయి, ఉంటుందని మర్చిపోకండి.

బంగాళదుంప డీహైడ్రేషన్‌కు మంచి ఔషధమని చెప్పవచ్చు. ఇందులో నీరు శాతం ఎక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్‌ కూడా నిండుగా ఉంటాయి. కాబట్టి బంగాళదుంపలపై ఉన్న అపోహలను మర్చిపొండి. మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి.

leave a reply