బోయపాటి శిష్యుడు…దర్శకత్వంలోకి

‘ఆర్ఎక్స్ 100’తో తనధైన ముద్ర వేసుకున్న యువ కథానాయకుడు కార్తికేయ తన కొత్త చిత్రాన్ని హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఈ సినిమాకి దర్శకుడిగా… ప్రముఖ దర్శకుడు బోయపాటి శీను వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన అర్జున్ జంధ్యాల ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమాకి నిర్మాతలుగా అనిల్‌ కడియాల, తిరుమల్‌ రెడ్డి పనిచేస్తున్నారు. జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్‌ టెలీ ఫిలిమ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సినిమా స్క్రిప్ట్‌ను హీరో, దర్శకుడు, నిర్మాతలకు అందచేశారు. అగ్ర దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వంతో పాటు హీరోపై క్లాప్‌ నిచ్చారు. నటులు అలీ, ప్రవీణా కడియాల కెమెరా స్విచాన్‌ చేశారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. నేను సినిమా ప్రారంభోత్సవాలకు ఎప్పుడు వెళ్ళాను . ఈ సినిమా నిర్మాతలకు నాకు టీవీ రంగం ద్వారా ఎప్పటి నుంచో మంచి అనుబంధం ఉండటంతో నేను ఏ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చానని చెప్పుకొచ్చారు. బోయపాటి మాట్లాడుతూ ‘నా దగ్గర 12 సంవత్సరాలుగా నాతో పాటు అసోసియేట్‌గా పని చేసిన అర్జున్‌ నాకు తమ్ముడు లాంటివాడు. టాలెంట్, టైమింగ్‌ అతనిలో చూసానాని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య, మిరియాల రవీందర్‌రెడ్డి, ప్రవీణ్, నటులు హేమ తదితరులు పాల్గొన్నారు.

leave a reply