బ్లఫ్ మాస్టర్…ఎలా ఉందంటే!

సత్యదేవ్ కధానాయకుడిగా గోపీగణేష్ దర్శకత్వంలో రోపొంచించబడిన చిత్రం “బ్లఫ్ మాస్టర్ “. ఈ  చిత్రం ఈ శుక్రవారం  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందిత శ్వేతా  ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ  చిత్రం పరవాలేధనిపిస్తుంది. మ‌నుషులు సాంకేతికంగా ఎదుగుతున్నారు.. కానీ అదే స్థాయిలో మోస‌పోతూనే ఉన్నారు. ఏదో స్కీమ్‌లో, స్కామ్ కార‌ణంగానో మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు మోస‌పోతుండ‌టాన్ని మ‌నం రోజూ చూస్తూనే ఉన్నాం. అలాంటి క‌థ‌తో త‌మిళ ద‌ర్శ‌కుడు వినోద్ తెర‌కెక్కించిన చిత్రం `చ‌దురంగ‌వేట్టై`. త‌మిళంలో ఘ‌న విజ‌యం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌డం జ‌రిగింది. ‘జ్యోతి లక్ష్మీ’.. ‘క్షణం’.. ‘ఘాజీ’ లాంటి సినిమాలలో తనకంటూ కొంత ఇమేజ్ ను సంపాదించాడు. ఇప్పుడతను పూర్తి స్థాయి హీరోగా నటించిన సినిమా ‘బ్లఫ్ మాస్టర్’.

ఉత్తమ్ కుమార్ (సత్యదేవ్) చిన్నతనంలోనే సర్వం కోల్పోతాడు. డబ్బులు సంపాదించడం కోసం ఏం చేయాలో తెలియని స్థితిలో మోసగాడిగా మారతాడు. రకరకాల తప్పులు  చేసి ఎదుగుతాడు. ఒకదాని తర్వాత ఒకటి ఘరానా మోసాలు చేసి కోట్లు సంపాదిస్తాడు. అతని వ్యూహం ఫలించక పోలీసులకు దొరికిపోతాడు అతడి మీద పలు కేసులు నమోదవుతాయి. అయితే తాను సంపాదించిన డబ్బుతో  కేసులూ తప్పించుకుని క్షేమంగా బయటికి వచ్చేస్తాడు. అయితే అతను చేసిన మోసాల కార‌ణంగా ఎటూ వెళ్ల‌లేని ప‌రిస్థితి వల్ల త‌ప్పించుకుని తిరుగుతుంటాడు. ఆ స‌మ‌యంలో ఉత్త‌మ్‌ను అవ‌ని ర‌క్షించి త‌నుండే అనాథాశ్ర‌మానికి తీసుకెళుతుంది. ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకున్న ఉత్త‌మ్ మంచివాడుగా బ్ర‌త‌కాల‌నే నిర్ణ‌యం తీసుకుంటాడు. మరి ఉత్తమ్ ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడ్డాడు.. మంచి మనిషిగా మారాడు అన్నది మిగతా కథ.

రేటింగ్:2.0/5

leave a reply