భారత గడ్డపై అడుగుపెట్టిన అభినందన్

కోట్లాదిమంది భారతీయుల నిరీక్షణకు తెరపడింది.భారత వాయుసేన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ స్వదేశానికి చేరుకున్నారు.వాఘా సరిహద్దు దగ్గర ఇరు దేశాల అధికారులు అప్పగింత పత్రాలు మార్చుకున్న తర్వాత అభినందన్‌ను భారత అధికారులకు అప్పగించారు.
భారత వాయుసేన ఉన్నతాధికారులు అభినందన్‌కు స్వాగతం పలికారు.అభినందన్‌ను భారత గడ్డపై చూడగానే అతడికి స్వాగతం పలికేందుకు వచ్చిన వేలాది మంది ప్రజలు ‘భారత్ మాతాకీ జై’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.అక్కడే సిద్ధంగా ఉన్న వైద్య బృందం అభినందన్‌కు ప్రాథమిక వైద్యపరీక్షలు నిర్వహించింది.తరువాత అక్కడి నుంచి అమృత్‌సర్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి తీసుకువెళతారు అని సమాచారం.

leave a reply