భారీ పారితోషకం కావాలంటున్న పూజా హెగ్డే!

తెలుగులో ఒక్కసారిగా ముగ్గురు అగ్ర హీరోలతో ఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే! త్రివిక్రమ్ దర్శకత్వలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అరవింద సమేత భారీ విజయాన్నిఅందుకుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాగే మహేశ్ బాబు .. ప్రభాస్ సినిమాలలో కూడా పూజా హెగ్డే ఛాన్స్ కొట్టేసింది. ఈ మూడు సినిమాల్లో ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అరవింద సమేత’ విజయం సాధించడంతో పూజా మార్కెట్ కూడా పెరిగింది. మహేశ్ బాబుతో ఆమె చేస్తోన్న ‘మహర్షి’ చిత్రం త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ సినిమా కోసం పూజా హెగ్డే పారితోషికంగా 2 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం పూజా ఎక్కువగా డేట్లు కేటాయించడంతో పారితోషికం ఎక్కువగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రం హిట్ అయితే పూజా హెగ్డే పారితోషికం మరింత పెరిగిపోయే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

leave a reply