భార్య పేరు… చూడగానే ఏం చేశాడంటే

మన దేశంలో స్టార్ హీరోలకి .. హీరోయిన్స్ కి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు అన్న విషయం మనకు తెలిసిందే. సహజంగానే అక్కడక్కడా కొన్ని ఐటమ్స్ వాళ్ల పేర్లతో కనిపిస్తుంటాయి. కస్టమర్లను ఆకర్షించడానికి వ్యాపారస్తులు ఈ పద్ధతిని అనుసరిస్తుంటారు.

ముంబయికి వెళితే హోటల్స్ లో సంజయ్ దత్ .. షారుక్ ల పేర్లతో ఆయా ఆహార పదార్థాలను విక్రయిస్తుండటం చూస్తాం. అయితే ఆ స్టార్స్ తమ పేరుతో వున్న ఆహార పదార్థాలను తామే ఆర్డర్ చేయవలసి వస్తే అదో థ్రిల్ ను కలిగిస్తుంది .. ఇక విదేశీ రెస్టారెంట్లలో ఈ అనుభవం ఎదురైతే మరింత థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది.

అటువంటి పరిస్థితే టెక్సాస్ లోని ఓ రెస్టారెంట్ లో దీపికా పదుకొణే దంపతులకు ఎదురైంది. న్యూ ఇయర్ వేడుకలను ఈ కొత్త జంట టెక్సాస్ లో జరుపుకుంది. స్థానికంగా ఒక హోటల్ కి వెళ్లిన ఈ దంపతులు అక్కడి మెనూలో దీపికా పదుకొణే పేరుతో వున్న ‘దోశ’ను చూసి ఆశ్చర్యపోయారట.

వెంటనే ఆ మెనూను రణ్ వీర్ ఫోటో తీసి తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. తనకి ఆ దోశ తినాలని వుంది అనే క్యాప్షన్ కూడా ఇచ్చాడు.

leave a reply