ఎప్పటికి కొడతాడో హిట్టు..!

‘మిస్టర్‌ మజ్ను’గా మన ముందుకు వచ్చేశాడు యంగ్‌ హీరో అఖిల్‌. మొదటి రెండు సినిమాలు అఖిల్‌కు బ్రేక్‌ ఇవ్వలేదు. కాబట్టి ఈ సినిమా బోలెడు ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. అయినా ప్రేక్షకులు నన్ను గుర్తుపెట్టుకునేందుకు కొంచెం టైం పడుతుంది.. దానికి నేను వాళ్లకు నచ్చేలా సినిమాలు తీయలంటూ అన్నాడు. అలాగే.. ‘తొలిప్రేమ’ మూవీతో విజ‌యాన్ని అందుకున్న యంగ్‌ డైరెక్టర్‌ వెంకీ అట్లూరి ద‌ర్శ‌కుడు కావ‌డం.. ప్ర‌చార చిత్రాల్లో అఖిల్ సంద‌డి ఆక‌ట్టుకోవ‌డంతో ‘మిస్ట‌ర్ మ‌జ్ను’పై అంచ‌నాలు బాగానే పెరిగాయి. మరి ఈ రోజే రిలీజైనా ‘మజ్ను’ సినిమాపై ఎలాంటి టాక్‌ వినిపిస్తుందో తెలుసుకోవాలంటే స్టోరీ ఏంటో తెలుసుకోవాల్సిందేగా..

అసలు స్టోరీ ఏంటంటే..

విక్కీ పెరిగిన వాతావరణం ప్రకారం అతనికి చాలా మంది గర్లఫ్రెండ్స్‌ ఉంటారు. అతని మాటలకు, తీరుకు అమ్మాయిలు పడిపోతూ ఉంటారు. అమ్మాయిలను ఆకర్షించేలా విక్కీ బిహేవియర్‌ ఉంటుంది. విక్కీ యూకేలో ఎంఎస్‌ చేస్తూంటాడు. అక్కడే నిక్కీ, విక్కీలు మొదటిసారిగా ఎదురవుతారు. విక్కీ తీరు, అత‌ని మ‌న‌స్త‌త్వాన్ని చూసి అస‌హ్యించుకుంటుంది. నిక్కీ త‌న‌కి కాబోయేవాడు శ్రీరాముడిలా ఉండాల‌ని క‌ల‌లు కనే ఓ సాధారణ అమ్మాయి. అప్పుడే.. ఒక‌రి ఇంటికి మ‌రొక‌రు వ‌చ్చిపోయే క్ర‌మంలో విక్కీ అస‌లు మ‌న‌సేంటో తెలుసుకుని అత‌ని ప్రేమ‌లో ప‌డుతుంది నిక్కీ. కానీ త‌న‌కి ఎక్కువ రోజులు ప్రేమించ‌డం తెలియ‌ద‌ని చెప్ప‌డంతో, మొద‌ట రెండు నెల‌లు ప్రేమించుకుని చూద్దాం అంటుంది. అలా ప్రేమ ప్ర‌యాణం మొద‌ల‌య్యాక వాళ్లిద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగింది? ఇద్ద‌రూ క‌లిసి జీవితాన్ని పంచుకున్నారా లేదా? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎవరెలా చేశారంటే..

అఖిల్‌ అన్నట్టుగా ఈ సినిమాలో బాగానే నటించాడు. కానీ కొన్ని సీన్లలలో తేలిపోయాడు. సెంటిమెంట్‌ సీన్లలో తన మొహంలో ఎటాచ్‌మెంట్‌ కనిపించలేదు. ఇంకొంచెం శిక్షణ తీసుకుంటే మంచిది. అలాగే ఈ సినిమాలో కూడా తన పవర్‌ఫుల్‌ డాన్స్‌తో అదరగొట్టాడు. సినిమా మధ్యలో ఒక సీన్‌లో 8 ప్యాక్స్‌తో కనిపించి అదరగొట్టాడు. అలాగే.. హీరోయిన్‌ నిధి అగ‌ర్వాల్ కూడా హీరోకి స‌మానంగా సినిమాలో క‌నిపిస్తుంది. ఆమె అందం, అభిన‌యం ప‌రంగా ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. రావు ర‌మేష్‌, జ‌య‌ప్ర‌కాష్‌, నాగ‌బాబు, ప‌విత్ర లోకేష్‌, సితారతో పాటు ప‌లువురు క్యారెక్ట‌ర్ న‌టులు తెర‌పై క‌నిపిస్తారు. ప్రియ‌ద‌ర్శి, విద్యుల్లేఖ రామ‌న్‌, సుబ్బ‌రాజు, హైప‌ర్ ఆది త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌వ్వించారు. త‌మన్ సంగీతం బాగానే ఉంది కానీ ప్రేక్షకుల్ల మనసుల్లోకి వెళ్లే ప్రయత్నం చేశాడు ఇత‌ర అన్ని విభాగాలు కూడా ద‌ర్శ‌కుడి ఆలోచ‌న‌ల‌కి త‌గ్గ‌ట్టుగా ప‌నిచేశాయి. డైరెక్టర్‌ వెంకీ అట్లూరి తొలి సినిమా ‘తొలిప్రేమ’ త‌ర‌హాలోనే మ‌రోసారి ప్రేమ‌క‌థ‌ని ఎంచుకొని ఈ సినిమా చేశాడు. అయితే ర‌చ‌న ప‌రంగా, క‌థ ప‌రంగా తొలి సినిమా త‌ర‌హా మేజిక్ ఇందులో క‌నిపించ‌దు. రొటీన్‌ స్టోరీగా ఉంది. కొత్తదనమేదీ ఈ సినిమాలో కనిపించలేదు.

చివరకు: ఈ సినిమా మొత్తానికి ఫరవాలేదనిపించింది. లవర్స్‌కి ఎక్కువగా చూసే సినిమాలా ఉంది. సినిమాలోని సీన్లు హీరో, హీరోయిన్‌ మధ్యలోనే ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. క్యారెక్టర్‌ ఆర్టిస్టుల పాత్రలు తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే సెంటిమెంట్‌ చూపించాలనుకున్నా ఎక్కువగా వెల్‌వేట్‌ అవ్వలేదు.

leave a reply