మేం మన్నించాం…ఇక ఐసీసీ ఇష్టం!

దక్షిణాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా సర్ఫరాజ్‌ జాతి వివక్షపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ ఫెలుక్‌వాయో నలుపు రంగును ఉద్దేశించి అతను చేసిన వ్యాఖ్యల అభ్యన్తకరంగా ఉండటంతో పలువురి నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అతనిపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. తాజాగా దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ స్పందించాడు తమ జట్టు ఆటగాడిపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన పాక్ కెప్టెన్ సర్ఫరాజ్‌ను క్షమిస్తున్నామని తెలిపాడు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన సర్ఫరాజ్ క్షమాపణలు కోరడంతో… మా జట్టు అతని క్షమాపణలు స్వీకరిస్తున్నట్లు తెలిపాడు. అంతే కాకుండా అతన్ని మేం మన్నిస్తున్నాం అని అన్నాడు. ఇక ఈ వివాదానికి సంబంధించిన మిగతా విషయాలకు ఐసీసీ స్పష్టత ఇస్తుందని తెలిపాడు.

వికెట్ నష్టపోకుండా జాగ్రత్తగా గ్రీజ్ లో పాతుకుపోయి సఫారీ జట్టును ఫెలుక్‌వాయో విజయం దిశగా తీసుకెళుతుండగా అసహనానికి గురైన పాక్ క్రికెటర్ జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడు. ‘ఒరే నల్లోడా… మీ అమ్మ ఇవాళ ఎక్కడ కూర్చుంది. ఈ రోజు నీ కోసం ఆమెతో ఏం మంత్రం చదివించుకొని వచ్చావు’ అని ఉర్దూలో అన్న మాటలు స్టంప్‌ మైక్‌లో స్పష్టంగా రికార్డయ్యాయి. సర్ఫరాజ్‌ తన వ్యాఖ్యలపట్ల విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరాడు. ఎవరినీ కావాలని దూషించలేదన్నాడు.

leave a reply