మొత్తానికి ఫిక్స్‌ అయ్యింది

అప్పుడని, ఇప్పుడని, మొత్తానికి ఎన్టీఆర్ ‘మహానాయకుడు’ సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయ్యింది. ఫిబ్రవరి 22న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ‘మహానాయకుడు’ టీం తెలిపినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాను ఫిబ్రవరి 7వ తేదీన విడుదల చేయాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. సంక్రాంతికి విడుదలైన ఎన్టీఆర్‌ ‘కథానాయకుడు’ బాక్సాఫీసును షేక్‌ చేసిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ ‘మహానాయకుడు’ సినిమాలో ఎన్టీఆర్‌ రాజకీయ జీవితాంతంపై సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. దివంగత ఎన్టీఆర్‌ పాత్రలో బాలక్రిష్ణ సరిగ్గా సరిపోయారని చెప్పుకున్నారు.

leave a reply