మోడీ పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు …

సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీపై ఘాటైన వ్యాఖ్యలు చేసారు.మోడీ శుక్రవారం విశాఖ బహిరంగ సభలో చంద్రబాబు పేరు ఎత్తకుండా పరోక్షంగా ఆయన మీద విరుచుకు పడ్డారు. ఆ తరువాత అమరావతిలో జరిగిన ఒక ఓ కార్యక్రమంలో బాబు.. మోడీపై విమర్శల వర్షం కురిపించారు. మన దేశభక్తిని ఎవ్వరూ శంకించలేరన్నారు.ఒక వైపు దేశం మొత్తం అభినందన్ రాక కోసం ఎదురుచూస్తున్న వేళ ప్రధాని మోదీ తనను తిట్టడానికే విశాఖపట్నం వచ్చారని ఆరోపించారు.సౌదీ అరేబియా ప్రిన్స్ వస్తే స్వయంగా వెళ్లి ప్రధాని రిసీవ్ చేసుకున్నారని,దేశం గర్వపడేలా చేసిన వీర పైలట్ అభినందన్‌ వస్తే ప్రధాని మోదీ స్వాగతం చెప్పేందుకు వెళ్లకుండా ఇక్కడికొచ్చి తమను విమర్శిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

రాజకీయాలను దేశభక్తితో ముడిపెట్టడం మోదీకి తగదు అని,కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప వ్యాఖ్యలే భాజపా రాజకీయాలకు నిదర్శనం అని అన్నారు. పుల్వామా ఘటన జరిగిన సమయంలో ప్రధాని మోదీ రాజస్థాన్ లో ఓ రాజకీయ సభలో పాల్గొన్నారు. కుటుంబ పాలన గురించి మోదీ పదేపదే మాట్లాడుతున్నారని, అసలు ఆయనకంటూ ఓ కుటుంబం ఉంటే కదా కుటుంబం గురించి తెలిసేది అంటూ వ్యగ్యంగా మాట్లాడారు.మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా, డిజిటల్ ఇండియా అంటూ గొప్పలు చెప్పే మోడీ వాటిని ఎంతవరకు సాధించారు అని బాబు ప్రశ్నించారు.ఇలాంటివన్నీ సాధించకపోగా ఆంధ్రకు చేసిన అన్యాయాన్ని అడుగుతున్నానని ప్రధాని మోదీకి నాపై చాలా కోపంగా ఉంది.కనిపిస్తే కొడతారేమో.. అంటూ ఛలోక్తి విసిరారు చంద్రబాబు.

leave a reply