రాజమౌళి చిత్రంలో ప్రభాస్!

తెలుగు సినిమా ఘనతను ప్రపంచానికి తెలియచేసి బాహుబలి లాంటి భారీ చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకధీరుడు రాజమౌళి తన తరువాతి సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే, ప్రస్తుతం ఈ చిత్రానికి ఆర్‌ఆర్‌ఆర్‌ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కిస్తుండగా…ఈ చిత్రం భారీ మల్టీస్టారర్‌గా చిత్రీకరించబోతుంది. ఈ సినిమాలో టాలీవుడ్ అగ్రహీరోలు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం రెండో షెడ్యూల్‌ షూటింగ్ జరుపుకుంటుండగా, ఈసినిమాకు సంబంధించి మరో న్యూస్‌ టాలీవుడ్ లో హల్‌చల్‌ చేస్తోంది.

ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా స్టార్‌ హీరో ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాడట. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లతో పాటు ప్రభాస్‌ను కూడా ఒకే ఫ్రేమ్‌లోచూపించేందుకు రాజమౌళి ప్లాన్‌ చేస్తున్నట్టుగా సమాచారం. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా విషయాలు బయటకు వస్తున్నా, చిత్రయూనిట్ మాత్రం దీనిపై స్పష్టత ఇంకా ఇవ్వలేదు. ప్రభాస్ పాత్ర గురించి రాజమౌళి స్పష్టత కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

leave a reply