రాజశేఖరుడి పాటలు రేపే!

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘యాత్ర’ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కూడా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటించగా ఈ సినిమాకి మహి.వి రాఘవ్ దర్శకత్వం వహించాడు. వచ్చే నెల 8వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబందించి రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరపడానికి సర్వం సిద్ధం చేస్తున్నారు. మాదాపూర్ లోని ప్రముఖ ఎన్ కన్వెన్షన్ లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్ తాజాగా ఓ పోస్టర్ ను విడుదల చేసారు. వైఎస్ పాత్రలో ఈ సినిమాకి మమ్ముట్టి ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్నారు. అయితే బారి అంచనాల మధ్య విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రంను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.

leave a reply