రేపే ‘మహానాయకుడు’ విడుదల

“ఎన్టీఆర్ ” బయోపిక్ రెండో భాగం ‘మహానాయకుడు’ రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ, నాడు టీడీపీ పార్టీ స్థాపించడం, ఆ తర్వాత తొమ్మిది నెలలకే ఎన్టీఆర్ అధికారంలోకి రావడం, ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం.. ఇవన్నీ రికార్డులేనని అన్నారు.ఈ బయోపిక్ కేవలం ఎన్టీఆర్ అభిమానులకే కాదని, తెలుగు ప్రజానీకానికి, తెలుగు జాతి కోసం తీసిందని, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ రేపు పర్వదినం అని అన్నారు.ప్రతి విషయంలో తన తండ్రి ఎన్టీఆర్ తనకు ఇన్ స్పిరేషన్ అని బాలకృష్ణ తెలిపారు.

leave a reply