విరాట్‌కి నువ్వే రికమెండ్‌ చేయాలి

ప్రస్తుతం బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కత్రినాకైఫ్ చేసిన పోస్ట్‌ నెట్‌లో హాల్‌ చల్‌ చేస్తుంది. తను నటిస్తున్న ‘భారత్‌’ సెట్‌లో ఇటీవలె ఆమె, చిత్ర యూనిట్‌ కలిసి క్రికెట్‌ ఆడారు. అయితే.. కత్రినా ఈ వీడియో పోస్ట్‌ చేస్తూ ప్రపంచకప్‌ దగ్గరలో ఉంది.. సో నాకూ క్రికెట్‌లో మెలకువలు నేర్పమని, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కు నువ్వే చెప్పాలంటూ అనుష్కశర్మను అడిగింది కత్రినా. నేను మరీ బ్యాడ్‌ ఆల్‌ రౌండర్‌ను కాదని.. మనకూ టైం వస్తుంది అనే హ్యాష్‌ ట్యాగ్‌తో పోస్ట్‌ చేసింది.

అయితే.. ఈ వీడియోలో కత్రినా ఫుల్‌ స్ట్రాంగ్ బ్యాటింగ్‌ చేస్తూ బాల్‌ను బౌండరీ దాటించారు. కత్రినా ఆట తీరుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. కత్రినా చాలా బాగా బ్యాటింగ్‌ చేస్తున్నారని.. ఆమెలో చాలా నైపుణ్యం దాగుందని అభినందించారు. మరికొందరు భారత మహిళా క్రికెట్‌ జట్టుకు మరో క్రీడాకారిణి దొరికేసింది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా.. కత్రినా ప్రస్తుతం ‘భారత్‌’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో సల్మాన్‌ఖాన్‌ హీరోగా యాక్ట్‌ చేస్తున్నారు. ఈ సినిమాని అలీ అబ్బాస్‌ జఫార్‌ డైరెక్ట్‌ చేస్తున్నారు. జూన్‌ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

leave a reply