వీరి కాంబినేషన్‌ హిట్‌ అవుతుందా..?

కెరీర్‌ ఆరంభంలోనే వరుసగా విభిన్నమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకుల మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు హీరో నారా రోహిత్‌. అయితే.. అందులో కొన్ని సినిమాలు మాత్రమే ఆయనకు గుర్తింపు తెచ్చాయి. ఆ తరువాత కొన్ని ప్లాప్‌లతో ఆయన సినిమాలకు కొంత దూరంగా ఉన్నాడు. అయితే.. ఈ సారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో డైరెక్టర్‌ చైతన్య దంతులూరికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. తొలి చిత్రం ‘బాణం’తోనే మంచి పేరు తెచ్చకున్నారు డైరెక్టర్‌ చైతన్య దంతులూరి.

కాగా.. ఇప్పటికే డైరెక్టర్‌ చైతన్య హీరో నారా రోహిత్‌ కోసం ఒక విభిన్నమైన కథను సిద్ధం చేశారట. నారా రోహిత్‌ కూడా ఇఫ్పటివరకూ అలాంటి పాత్ర చేయటలేదట. సో నారా రోహిత్‌ కూడా ఈ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారంట. ప్రీ పొడక్షన్‌ పనులు కూడా పూర్తి చేశారట. వచ్చే నెల చివర్లో సెట్స్‌ పైకి సినిమా వెళ్లనుంది. మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది. అయితే.. వీరిద్దరి కాంబినేషన్‌ సెట్‌ అవుతుందా..? హిట్‌ పడుతుందా..? చూడాలి.

leave a reply