వీళ్లని గుర్తుపట్టగలరా..?

సంచలన డైనమిక్‌ డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ దివంగత ఎన్టీఆర్‌ జీవితాన్ని మలుపుతిప్పిన కొన్ని సన్నివేశాలను సినిమాగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. నటసార్వభౌముడు జీవితంలోకి భార్యగా ‘లక్ష్మీపార్వతి’ ఎలా వచ్చింది..? ఆమె రాకతో ఎన్టీఆర్‌ జీవితం ఎలా మలుపు తీసుకుంది..? ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచింది ఎవరు..? అనే ప్రశ్నలు వేస్తూ.. ఆయన తీస్తున్న సినిమాలోని ఒక్కో క్యారెక్టర్‌ ఫొటోను ట్విట్టర్‌లో పరిచయం చేస్తూ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచుతున్నారు.

తాజాగా.. డైరెక్టర్‌ వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాలోని మరో ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ ఫొటోలో కనిపిస్తున్న ఈ క్యారెక్టర్స్‌ ఎవరివి? మీరు గుర్తుపట్టగలరా? అంటూ ఫన్నీగా కామెంట్‌ చేశారు. నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది.. ఈ ఫొటోలోని వ్యక్తులంతా లక్ష్మీపార్వతి కారణంగా అప్‌సెట్‌ అయినట్టు కనిపిస్తున్నారంటూ ఫొటోను పోస్ట్‌ చేశారు. కాగా.. ఈ సినిమాపై ఎన్నో బెదిరింపులు వచ్చినా లెక్కచేయకుండా ఆయన ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా..? అంటూ ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

leave a reply