వైసీపీ మేనిఫెస్టోపై స్పందించిన జనసేనాని

గుంటూరు జిల్లా నరసారావుపేట బహిరంగ సభలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ .. వైసీపీ మేనిఫెస్టోకు రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్ కావాలన్నారు. వైసీపీలాగా మోసపూరిత హామీలు ఇవ్వలేనని తెలిపారు . నిజాయితీగా చేయగలిగే హామీలు మాత్రమే ఇస్తానని పవన్ స్పష్టం చేశారు.వైసీపీ, టీడీపీలతో కలవనని వామపక్షాలతో మాత్రమే కలసి పోటీచేస్తానన్నారు.

ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు చేతులెత్తి మొక్కుతున్నాను.. మీ స్వార్థ రాజకీయాలకు ప్రజలను బలిచేయవద్దు అని పవన్ హితవు పలికారు.

leave a reply