శాంటాలా.. మహేష్‌, ఎంజాయ్‌ చేసిన చెర్రీ

దేశవ్యాప్తంగా క్రిస్మ‌స్ వేడుక‌లు నిన్న ఘ‌నంగా జ‌రిగాయి. ఇక నిన్న సాయంత్రం క్రిస్మ‌స్ వేడుక‌లని దేశంలోని ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఘ‌నంగా జ‌రుపుకున్నారు. ఎంతైనా సినీ హీరోలు తమ కుటుంబాలతో ఒకచోట కలిస్తే ఆ సందడే వేరు. ఈ మ‌ధ్య ప్ర‌తి పార్టీలో క‌లిసి క‌నిపిస్తున్న మ‌హేష్‌, రామ్ చ‌ర‌ణ్‌లు క్రిస్మ‌స్ వేడుక‌ని క‌లిసి సెల‌బ్రేట్ చేసుకున్నారు. వేడుక‌ల‌లో మ‌హేష్ భార్య నమ్ర‌త‌, రామ్ చ‌ర‌ణ్ సతీమ‌ణి ఉపాస‌న కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోస్‌ ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. కాగా.. ఫొటోల్లో చూస్తుంటే క్రిస్మస్‌ వేడుకల్లో సినీ నటుడు బాలకృష్ణ కుమార్తె బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు. మహేశ్‌ శాంటాక్లాజ్‌ గెటప్‌లో ఆకట్టుకుంటున్నారు. తమ అభిమాన తారలు కలిసి సందడి చేస్తే అభిమానులకు అంతకు మించిన సంతోషం ఏం ఉండదు.

అయితే.. చాలా వరకూ చెర్రీ, జూ.ఎన్టీఆర్‌ ఎక్కువగా వాళ్ల భాగస్వాములతో కలిసేవారు.. కాని నిన్న జరిగిన ఈ వేడుకల్లో మాత్రం తారక్‌, ప్రణతి మిస్సయినట్టు తెలుస్తుంది.

కాగా.. మ‌హేష్ ప్ర‌స్తుతం మ‌హ‌ర్షి సినిమాతో బిజీగా ఉండ‌గా, ఇక రామ్ చ‌రణ్ న‌టించిన విన‌య విధేయ రామ చిత్రం సంక్రాంతికి విడుద‌ల కానుండ‌గా, ప్రీ రిలీజ్ వేడుకని డిసెంబ‌ర్ 27న జ‌ర‌ప‌నున్నారు. మ‌రోవైపు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మ‌ల్టీ స్టార‌ర్‌లోను న‌టిస్తున్నారు రామ్ చ‌ర‌ణ్‌.

leave a reply