సమ్మర్‌లో హాయిగా ఉండాలంటే..?

వచ్చేది.. సమ్మర్‌.. అసలే ఉక్కపోత.. ఎండలు మండిపోతాయి.. ఫ్యాన్లు, ఏసీలు ఎన్ని వేసినా ఉక్కోత ఆగదు. అలాంటప్పుడు మనం ధరించే దుస్తులు తేలికగా, మెత్తగా ఉంటే ఆహా.. ఎంత హాయి కదా..! మరి అది ఏం ఫ్యాబ్రిక్‌ అని ఆలోచిస్తున్నారా..? ఎరీ సిల్క్‌. వచ్చే సమ్మర్‌కి ఇది బెస్ట్‌ ఛాయిస్‌ అని ఫ్యాషన్‌ డిజైనర్స్‌ చెబుతున్నారు.

ఈ ఎరీ సిల్క్ చూడటానికి క్లాస్‌గా ఉంటుంది. ఎక్కడికి వెళ్లడానికైనా దీన్ని వేర్‌ చేయడం చాలా తేలిక. నిజంగానే ఈ ఎరీ సిల్క్‌ చాలా తేలికగా, మెత్తగా ఉంటుంది. ఫ్యాషన్ ట్రెండ్స్ ఎప్పుడూ ఒకేలా ఉండవు. రకరకాల ట్రెండ్స్ వచ్చి ఎప్పటికప్పుడు కొత్త వాటిని పరిచయం చేస్తూ పోతూంటాయి. ఈ మధ్య పాతవాటినే కొద్దిగా ట్రెండీగా తయారు చేస్తున్నారు. ఎరీనా బ్రాండ్ పేరిట వస్తున్న డ్రెస్సులు ఇటు వింటర్‌లోనూ.. అటు సమ్మర్‌లోనూ వేసుకోవచ్చని అంటున్నారు ఫ్యాషన్‌ నిపుణులు. ఎరీ సిల్క్ ఏక్‌దమ్ ఫిట్ ఉంటుందనీ.. రాబోయేదంతా ఎరీ స్కిల్ ట్రెండేనని పలువురు ఫ్యాషన్ డిజైనర్లు పేర్కొన్నారు.

ఈ ఎరీ సిల్క్స్‌లో శారీస్‌తో పాటు డ్రెస్సెస్‌, మెటీరియల్స్‌ అన్నీ రకాల టాప్స్‌ మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి.

leave a reply