హాయిగా నిద్రపోండిలా..!

నిద్రకు సమయం.. కాలం తెలీదు అంటారు. అవును అతిగా తిన్నా.. అలసిపోయినా.. నిద్ర దానంత అదే వచ్చేస్తుంది. అప్పుడు కంట్రోల్‌ చేసుకోవడం చాలా కష్టం కదా..? కానీ.. చాలా మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతూంటారు. రకరకాల కారణాల వల్ల నిద్రకు దూరమవుతున్నారు. ఏం చేయాలో.. అర్థం కాదు.. దాని ఒత్తిడి పలు రకాల పనులపై ఎఫెక్ట్‌ చూపిస్తుంది. మరి సమయానికి నిద్రపోవాలంటే ఎలా.. ఏం చేయాలో చూసేయండి..!

హాయిగా నిద్రపట్టాలంటే.. రాత్రి పూట టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. రాత్రుళ్లు ఆలస్యంగా భోజనం చేయకూడదు. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం , నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. నిద్రకు ఉపక్రమించే ముందు మనసును, మెదడును ప్రశాంతంగా పెట్టుకోవాలి. అవసరం అనుకుంటే కనీసం పదినిమిషాలు ధ్యానం చేయడం మంచిది. శ్రావ్యమైన సంగీతం, ఇష్టమైన పుస్తకం.. ఇలా మీకు నచ్చింది చేస్తూ నిద్రను ఆహ్వానించేందుకు ప్రయత్నించండి. ప్రతిరోజూ రాత్రిపూట పడుకోబోయే ముందు గ్లాసు వెచ్చటి పాలు తాగితే నిద్ర బాగా పడుతుంది. ఈ పాలలో పావు చెంచా దాల్చిన చెక్క పొడి కలిపి నిద్రకు ఉపక్రమించే గంట ముందు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చిట్కాలు పాటించి హాయిగా నిద్రపోండి.

leave a reply