హెచ్‌ఐవీ నియంత్రణకు కొత్త పద్ధతులు!

ప్రపంచంలో అతి పెద్ద వ్యాధి ఏదైనా ఉంటే అది హెచ్‌ఐవీ అని చెప్పవచ్చు. అయితే హెచ్‌ఐవీని నిరోధించి, వ్యాధి నిరోధకశక్తిని పెంచే టీకాను మరింత అభివృద్ధి చేసే కొత్త పద్ధతులను పరిశోధకులు గుర్తించారు. ఇన్‌ఫెక్షన్ల నియంత్రణ, హెచ్‌ఐవీ కణాలపై వ్యాధి నిరోధక టీ- కణాలను ప్రతిస్పందించడం మధ్య గల సంబంధాన్ని కెనడాకు చెందిన సిమోన్‌ ఫ్రేజర్‌ యూనివర్సిటీ, దక్షిణాఫ్రికాలోని క్వాజులు-నాటల్‌ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. మాములుగా హెచ్‌ఐవీ కణాలు తన రూపును మార్చుకుని టీ-కణాల నుంచి తప్పించుకుంటాయని ప్రొఫెసర్‌ మార్క్‌ బ్రోక్‌మన్‌ తెలియచేసారు. ఇందుకోసం ఆ కణాలు తప్పించుకోలేని విధంగా వ్యాధినిరోధక శక్తిని పెంచే టీకాలను కనుగొని హెచ్‌ఐవీని నియంత్రించవచ్చని తెలిపారు.

leave a reply