నటి శ్రీదేవి మొదటి వర్థంతి

దివంగత నటి శ్రీదేవి అనంతలోకాల్లో కలిసిపోయి ఏడాది కావొస్తోంది. అయితే.. శ్రీదేవి చనిపోయింది ఫిబ్రవరి 24వ తేదీనే అయినా.. చనిపోయిన తిథి ఈరోజే రావడంతో ఫిబ్రవరి 14ను ఆమె వర్ధంతిగా పరిగణిస్తూ బోనీ కపూర్‌ కటుంబం చెన్నైలోని శ్రీదేవి నివాసంలో ప్రార్థన కార్యక్రమాన్ని నిర్వహించింది. కార్యక్రమంలో బోనీ కపూర్‌, కుమార్తెలు జాన్వి, ఖుషి, అనిల్‌ కపూర్‌లతో పాటు ప్రముఖ నటుడు అజిత్‌, షాలిని కూడా హాజరయ్యారు. అజిత్‌కు బోనీ కపూర్‌ కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. శ్రీదేవి నటించిన ‘ఇంగ్లిష్‌ వింగ్లిష్’ చిత్రంలో అజిత్‌ అతిథి పాత్రలో నటించారు. అప్పుడే వీరు మంచి స్నేహితులయ్యారు.

leave a reply