‘ఆర్‌ఆర్‌ఆర్‌’కి నో చెప్పిన బాలీవుడ్‌ భామ

బాహుబలి సినిమా తరువాత కొంత కాలం బ్రేక్ తీసుకొని మళ్లీ తెర మీదికి వచ్చాడు రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో సినిమా తీయబోతున్న అని ప్రేక్షకుల్ని ఆసక్తి కి గురి చేశారు. దీనికి గాను చాలా రూమర్స్ నడిచాయి. ‘ఆర్ఆర్ఆర్’ అనే పేరుతో తెరకెక్కతున్న ఈ మూవీలో హీరోయిన్లుగా నటించేది ఎవరు? అనే ప్రశ్న అభిమానుల్ని తికమక పెడుతుంది. ఈ అంశం పై కొంతకాలంగా చాలా మంది పేర్లు బయటకి వచ్చాయి..కానీ అధికారికంగా మాత్రం రాజమౌళి ఏవ్వరిని ప్రకటించలేదు.

ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లనే తీసుకోవాలనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో ఇటీవల చిత్ర బృందం హీరోయిన్ అలియా భట్‌ను సంప్రదించినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఆమె డేట్స్ ఖాళీ లేక పోవడంతో ‘ఆర్ఆర్ఆర్’ ఆఫర్‌ను రిజక్ట్ చేసినట్లు తెలుస్తోంది. గతంలో ప్రభాస్ ‘సాహో’ సినిమా కోసం కూడా అలియా భట్‌ కోసం ట్రై చేశారు. అప్పుడు కూడా ఇదే పరిస్థితి.

ప్రస్తుతం ఆమె‘తక్త్’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉంది. దీంతో పాటు అశ్వినీ ఐయ్యర్ తివారితో ఓ సినిమాకు కమిటయ్యారట. ఇక డేట్స్ కుదరకపోవటంతో ఆమె ఈ సినిమాని రిజెక్ట్ చేసిందని చెబుతున్నాయి టాలీవుడ్ వర్గాలు.

leave a reply