టీమిండియా పేసర్‌కి గాయం!

టీమిండియా పేసర్ అశోక్ దిండాకు ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో బంతి తలకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సందర్భంగా ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా బెంగాల్‌ జట్టు ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో అశోక్ దిండా వేసిన బంతిని బ్యాట్స్‌మన్‌ స్ట్రయిట్ డ్రైవ్ ఆడడంతో బంతి నేరుగా వచ్చి బౌలింగ్‌ చేస్తున్న దిండా తలకు బలంగా తగలడంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం దిండాను ఆస్పత్రికి తరలించారు.

వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ జారుతుండగా, ఈ క్రమంలోనే దిండా వేసిన ఒక ఓవర్‌లో బెంగాల్‌ ఆటగాడు బిరిందర్‌ వివేక్‌ సింగ్‌ స్ట్రయిట్‌ డ్రైవ్‌ కొట్టాడు. ఆ బంతిని తప్పించుకునే ప్రయత్నంలో విఫలమవడంతో దిండా తలకు బంతి బలంగా తాకింది. దాంతో దిండా ఒక్కసారిగా మైదానంలోనే కింద పడిపోయాడు. అతనికి అక్కడే చికిత్స అందించిన అనంతరం ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు సీటీ స్కాన్‌ చేసిన తర్వాత అతనికి ఎటువంటి ప్రమాదం లేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

leave a reply