ఘనంగా దుబాయ్‌లో ‘ఆసియా విజన్‌’.. అవార్డుల ఫంక్షన్‌..!

దుబాయ్‌లో ఆసియా విజన్‌ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. గత ఏడాది భారత చిత్ర పరిశ్రమలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ధనుష్‌, రణ్‌వీర్‌ సింగ్‌, త్రిష, విజయ్‌ సేతుపతి, కియారా అడ్వాణీ, ఆయుష్మాన్‌ ఖురానా, మంజూ వారియర్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకలో త్రిష ‘యాక్ట్రెస్‌ ఆఫ్‌ ది డికేడ్‌’‌ అవార్డు అందుకున్నారు. ఇదే కార్యక్రమంలో నటులు రణ్‌వీర్, ధనుష్‌ కూడా అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఉత్తమ నటుడు (బాలీవుడ్‌): రణ్‌వీర్‌ సింగ్‌ (పద్మావత్‌), ఉత్తమ నటుడు (దక్షిణాది): విజయ్‌ సేతుపతి (విక్రమ్‌ వేద), ఉత్తమ నటి: ఆశా శరత్‌ (భయానకం), ఉత్తమ ప్రతినాయకుడు: జిమ్‌ సర్బ్ (పద్మావత్‌), ఉత్తమ నటుడు (బాలీవుడ్‌-క్రిటిక్‌): ఆయుష్మాన్‌ ఖురానా (బదాయి హో/అంధాధున్‌), ఉత్తమ నటుడు (దక్షిణాది-క్రిటిక్‌): ధనుష్‌ (వడ చెన్నై/మారి 2), బెస్ట్‌ యాక్ట్రెస్‌ ఆఫ్‌ ది డికేడ్‌: త్రిష, ఉత్తమ ప్రదర్శన: సద్నా వెంకటేశ్‌ (పేరాంబు), స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌: ఐశ్వర్య లక్ష్మి (వరతన్‌), ఎమర్జింగ్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌: కియారా అడ్వాణీ, 2006 నుంచి ఈ ఆసియా విజయ్‌ అవార్డుల ప్రదానోత్సవం జరుగుతోంది. ఫిబ్రవరి 16న 13వ ఆసియా విజన్‌ వేడుక జరిగింది.

leave a reply