సినీ నిర్మాత నారా జయశ్రీ దేవి మృతి

ప్రముఖ సినీ నిర్మాత నారా జయశ్రీ దేవి (60) కన్నుమూశారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆమె ఈరోజు తుదిశ్వాస విడిచారు. జయశ్రీ మృతిపై కన్నడ, తెలుగు సినీ రంగ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు. ‘భవానీ’,  ‘నమ్మోరా మదర హూవే’, ‘అమృత వర్షిణి’, ‘శ్రీ మంజునాథ’, ‘సైలెంట్‌’ తదితర సినిమాల్ని నిర్మించారు. ఉపేంద్ర నటించిన ‘ముకుంద మురారి’ చిత్రానికి ఎగ్జిక్యూటీవ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమెకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. కాగా.. ఆమె పార్థివ దేహాన్ని బెంగళూరుకు తరలించనున్నారు.

leave a reply