నేను ఇలా ఉన్నానేంటి..?

నేను ఇలా ఉన్నానేంటి..? అని వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన డైరెక్టర్‌ రామ్‌గోపాల్‌ వర్మ తనను తానే ప్రశ్న వేసుకున్నారు. కరెక్ట్‌గా.. ఈ రోజుకు ‘శివ’ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైందని తన పాత గుర్తులను గుర్తుచేసుకున్నారు ప్రముఖ దర్శకుడు వర్మ. అక్కినేని నాగేశ్వర్‌ రావు గారు ‘శివ’ సినిమా మొదటి రోజు షూటింగ్‌ను ప్రారంభించారంటూ.. ఆ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్‌ చేశారు. అలాగే.. తన పాత చిత్రాన్ని చూపిస్తూ ‘నేను అప్పుడు నిజంగా రోడ్‌ సైడ్‌ రోమియాలా ఉన్నాన్నేంటి..? నమ్మలేకపోతున్నా.. అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం రామ్‌గోపాల్‌ వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్‌, లక్ష్మీ పార్వతి జీవితాల ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కాగా.. ఫిబ్రవరి 22న ఈ చిత్ర థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల కాబోతోంది.

leave a reply