సిరీస్ సమం చేసిన… టీమిండియా!

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాదించి లెక్క సరి చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కివీస్‌ భారత బౌలర్ల ధాటికి 159/8 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్లు రోహిత్, ధావన్ శుభారంభాన్ని అందించారు.   భారత ఆటగాళ్లలో రోహిత్‌ శర్మ(50; 29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు), శిఖర్ ధావన్‌(30; 31 బంతుల్లో 2 ఫోర్లు) వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 79 పరుగులు జోడించిన తర్వాత రోహిత్‌ ఔటయ్యాడు. వెంటనే శిఖర్‌ కూడా పెవిలియన్‌ చేరడంతో రిషభ్‌ పంత్‌, విజయ్‌ శంకర్‌ల జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది.

ఈ దశలో విజయ్‌ శంకర్‌(14) పరుగులు చేసి మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. అనంతరం రిషభ్‌కు జత కలిసిన ఎంఎస్‌ ధోని మరో వికెట్ పడకుండా జాగ‍్రత్తగా ఆడారు. రిషబ్‌(40 నాటౌట్; 28 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక‍్సర్‌‌), ధోని(20 నాటౌట్‌) జట్టుకు విజయాన్ని అందించారు. దాంతో సిరీస్‌1-1తో సమం అయ్యింది. కివీస్‌ బౌలర్లలో ఇష్‌ సోధి, డార్లీ మిచెల్‌, ఫెర్గుసన్‌లు  తలో వికెట్‌ పడగొట్టారు. అంతకుముందు భారత బౌలర‍్లలో కృనాల్‌ పాండ్యా మూడు వికెట్లతో చెలరేగగా, ఖలీల్‌ అహ్మద్‌ రెండు వికెట్లు, భువనేశ్వర్‌ కుమార్‌, హార్దిక్‌ ఒక్కో వికెట్‌తో న్యూజిలాండ్ ను కోలుకోలేని దెబ్బతీశారు.

leave a reply