మీకు మాత్రమే చెప్తా..!

కింగ్ ఆఫ్ ది హిల్ పేరుతో విజయ్ దేవరకొండ స్వీయ నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా విజయ్‌ ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో తరుణ్‌భాస్కర్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకి షమ్మీర్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి ‘మీకు మాత్రమే చెప్తా’ అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించినట్లుగా తెలిసింది. ఓ ఇన్నోవేటీవ్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమాని చేస్తున్నారని సమాచారం. కాగా.. విజయ్‌, తరుణ్‌ భాస్కర్‌ ఇద్దరు మంచి ‌స్నేహితులు కూడా కావటంతో ఈ సినిమాపై విజయ్‌ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అలాగే.. ఈ సినిమాలో కూడా తరుణ్‌ భాస్కర్‌ డిఫ్రెంట్‌గా కనిపిస్తున్నారని.. దాని కోసం తన గడ్డాన్ని కూడా తీసేశారని టాలీవుట్‌లో టాక్‌.

కాగా.. మహానటి చిత్రంలో సింగీతం శ్రీనివాసరావు పాత్రలో కనిపించారు అలరించారు తరుణ్‌ భాస్కర్‌. త్వరలో విడుదలకాబోతున్న ‘ఫలక్‌నుమా దాస్’ సినిమాలో కూడా ఫుల్‌లెంగ్త్ రోల్‌ను పోషించారు. అయితే.. విజయ్‌దేవరకొండ నిర్మించే చిత్రం ద్వారా హీరోగా తరుణ్‌ భాస్కర్‌ పరిచయం కాబోతుండటం విశేషం.

leave a reply