రోహిత్,కోహ్లీ ఇద్దరిలో ఎవరు బెస్ట్!

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ..తాత్కాలిక సారథి రోహిత్‌ శర్మ…వీరిద్దరిలో ఎవరు ఉత్తమ బ్యాట్స్‌మెన్‌ అనే ప్రశ్నకు జవాబు చెప్పడం కష్టమే! వీరిద్దరి అట తీరు చూస్తే ఎవ్వరిని తక్కువ చేయలేం. ఎందుకంటే ఒకరేమో పరుగుల యంత్రం. మరొకరేమో సిక్సుల వీరుడు. వీరిద్దరిలో బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ ఎవరో చెప్పడం టీమిండియా సీనియర్‌ క్రికెటర్లకు సైతం కష్టతరమే. శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌ అనంతరం హర్భజన్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడాడు. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరిలో టీ20లో ఉత్తమ బ్యాట్స్‌మెన్‌ ఎవరని మీడియా అడిగిన ప్రశ్నకు బజ్జి ఈ విధంగా సమాధానమిచ్చాడు.

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ అద్భుతమైన ఆటగాళ్లు ఇద్దరిలో బెస్ట్ ఎవరని చెప్పడం కొంచం కష్టమే! ఇద్దరికి మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉంది. వాళ్లేంటో చెప్పక్కర్లేదు వారు సాధించిన రికార్డులే చెబుతాయి. రోహిత్‌ అద్భుతమైన ప్రతిభావంతుడు‌. కోహ్లీ కష్టపడే ఆటగాడు. రోహిత్‌లాగా కోహ్లీకి టాలెంట్‌ లేకపోవచ్చు కానీ, ఆటపట్ల అతడు చూపించే కఠిన శ్రమ, ఇష్టమే కోహ్లీని ముందుకు  నడిపిస్తున్నాయని వివరించాడు. కాబట్టి ఇద్దరిలో ఎవరు బెస్ట్ అనేది చెప్పడం కష్టం. ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం నా వల్ల కాదు. ఇద్దరూ టీమిండియా విజయానికి ఎంతో కృషి చేస్తున్నారు అని తెలిపాడు.

leave a reply