చలి కాలంలో… ఇవి వాడండి!

చలికాలంలో జలుబు, దగ్గు వంటివి సర్వ సాధారణం. ఇవి ఎక్కువగా వాతావరణంలో మార్పులు, చల్లటి గాలులు, సూర్యరశ్మి తక్కువగా ఉండడమే కాకుండా తీపి పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం కారణంగా చెప్పొచ్చు. అయితే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే అనారోగ్యాల బారిన పడకుండా రక్షణ పొందొచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

చాలా మంది పసుపును క్రిమి సంహారకంగా చెబుతుంటారు. పసుపును రాత్రి పూట నిద్రపోయే ముందు పాలలో కొద్దిగా వేసుకొని తాగితే… జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వీటిలో మిరియాల పొడి కలుపుకొని తాగితే జలుబుకు మంచిదని చెప్తారు.

చిలగడదుంపలో విటమిన్‌ ఎ, పీచు పదార్థం, పొటాషియం అధికంగా ఉండటం వల్ల దీనిని తింటే కడుపు ఉబ్బరం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా తేనె కలిపిన అల్లం ముక్కలను గానీ, అల్లం రసం గానీ రోజు తీసుకుంటే దగ్గు, జలుబు వంటి జబ్బులను సులభంగా నయం చేసుకోవచ్చు. అల్లం తీసుకోవడం వల్ల జీర్ణశక్తి కూడా మెరుగవుతుంది.

leave a reply