నిన్నూ వదలను, పైరసీని వదలను..!

Priyal Gor, Naveen Chandra in Chandamama Raave Movie Stills

పైర‌సీ వల్ల తెలుగు సినిమా ఎంత న‌ష్ట‌పోతోందో నిర్మాత‌లు గ‌గ్గోలు పెడుతున్నారు. ‘కిల్ పైర‌సీ’ అంటూ ఉద్య‌మాలు చేస్తున్నారు. పైర‌సీ చేసిన‌వాళ్ల‌ని సినిమా ద్రోహులుగా చూస్తున్నారు. కానీ.. ఈ సినిమాలో మాత్రం `పైర‌సీ ద్రోహి`ని సైతం హీరోగా చూడబోతున్నాం. ఆ సినిమాకు `హీరో న‌వీన్ చంద్ర, హీరోయిన్‌ గాయ‌త్రీ సురేష్ జంట‌గా న‌టించారు. ప్రముఖ డైరెక్టర్‌ పూరీ ట్విట్టర్‌ వేదికగా ఈ మూవీ టీజర్‌ను లాంచ్‌ చేశారు.  దాంతో థియేటర్‌ వద్ద అభిమానులు నవీన్‌ చొక్కా పట్టుకుని ఇలా ఎందుకు చేస్తావని నిలదీస్తారు. ‘వచ్చే వారం రామ్‌చరణ్‌ సినిమా విడుదలవుతుంది. ఇంకా ఎక్కువ పైరసీ చేస్తా’ అని చెప్పగానే సదరు అభిమాని తెగ సంబరపడిపోవడాన్ని ఫన్నీగా చూపించారు.

కాగా.. ఈ మూవీ ట్రైలర్‌లో ‘ప్రొడ్యూసర్‌ కూతురివైతే నాకేంటే.. నిన్నూ వదలను, పైరసీని వదలను..’ అంటూ నవీన్‌ చంద్ర తన లవర్‌తో చెప్పే డైలాగ్‌ ఇంకా హైలైట్‌గా నిలిచింది. మొత్తానికి పైరసీతో ముడిపడిన ఓ ప్రేమకథా చిత్రమిది. టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. మార్చిలో ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేస్తున్నట్లు ట్రైలర్‌లో తెలిపారు. ఈ సినిమాకి జీఎస్‌ కార్తిక్‌ దర్శకత్వం వహించారు.

leave a reply