ఐష్ తో మహానటి..! మణిరత్నం సినిమాలో ఇద్దరు రాణులు..!

మహానటి సినిమాతో మంచి హిట్ అందుకున్న కీర్తి సురేశ్ కొంత కాలాంగా సినిమాలని ఆచ్చి తూచి ఒకే చేస్తుంది. కథ ని విని ఆలోచించి మంచి రోల్ అనుకుంటేనే ఒకే చేస్తుంది. ఇక మహానటి తరువాత సర్కార్ కూడా హిట్ అయ్యేసరికి ఆమె స్టార్‌డమ్ పెరిగింది, ఆమె మార్కెట్ కూడా పెరిగింది. అన్నీ సినిమాల్లో ప్రధాన పాత్రలు అయితే ఒకే చేస్తున్న ఈ భామ ఇప్పుడు మని రత్నం సినిమాలో సెకండ్ హీరోయీన్ గా నటిస్తుందట.

రెండో కథానాయికగా ఎందుకు అనుకుంటున్నారా..? ఎందుకంటే మొదటి కథానాయికగా ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయి నటిస్తుంది. మణిరత్నం తెరకెక్కించబోయే పొన్నియిన్ సెల్వన్ అనే హిస్టారికల్ ఫిల్మ్ లో కీర్తి సురేష్ నటించనుంది. అమితాబ్ బచ్చన్ – విక్రమ్ – కార్తీ – మోహన్ బాబు వంటి వారు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కీర్తి సురేష్ ని మహారాణి పాత్ర కోసం దర్శకుడు సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐశ్వర్య రాయ్ పాత్రకు సమానంగా కీర్తి కనిపిస్తుందట. దీంతో సినిమాపై కోలీవుడ్ లో అంచనాలు పెరిగాయి

leave a reply