వెన్నుపోటుపై పాట.. ఎప్పుడంటే?

సంచలనాలకు మారుపేరు అయినా రామ్ గోపాల్ వర్మ “లక్ష్మీస్ ఎన్టీఅర్” అనే చిత్రాన్నితెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మద్యకాలం లో తెరకెక్కించిన సినిమాల్లో పెద్దగా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండానే వర్మ సినిమాలు వచ్చాయి. వర్మ సినిమాలలో పాటలు పెద్దగా ఉండవు అంతేకాకుండా రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా వర్మ తన  సినిమాలను తెరకెక్కించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన దర్శకత్వం లో రూపొందుతున్న ‘లక్ష్మీస్ఎన్టీఆర్’ మూవీ లో మాత్రం పాటలు దండి గా ఉండబోతున్నట్లుగా అర్థమవుతోంది. రామ్ గోపాల్ వర్మ సినిమాలలో లో రెండు మూడు పాటల కంటే ఎక్కువ ఉండవు. కాని ఈసారి మాత్రం ఈ చిత్రంలో లో ఏకంగా 8 పాటలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

నందమూరి బాలకృష్ణ  తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్’ చిత్రానికి పోటీగా అన్నట్లుగా ఈ చిత్రంను దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ సినిమాకు కీరవాణి సంగీతాన్ని సమకూర్చితే లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీకి మాత్రం కళ్యాణి మాలిక్సంగీతాన్ని అందిస్తున్నట్లు తెలుస్తుంది. పైగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక పాట..”వెన్నుపోటు” పాటను ఈ నెల 21న విడుదల చేయనున్న వర్మ. ఈ చిత్రం కోసం కళ్యాణ్ మాళిక్ ఏకంగా ఎనిమిది పాటలను సిద్ధం చేశాడట.

ఈ చిత్రంలో అంతా కొత్తవారే నటిస్తున్నట్లుగా వర్మ చెప్పుకొచ్చాడు. సినిమాలోని ప్రతి పాట కూడా సందర్బానుసారంగా వస్తుందని ప్రతి పాట కూడా ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిల మద్య ఉన్నఅనుబంధాన్ని వారి ప్రేమ ను చూపించే విధంగా ఉంటుందట. ఎన్టీఆర్ కు లక్ష్మీ పార్వతి ఏవిధంగా పరిచయం అయ్యిందో ఆ తరువాత పరిణామాలకు దారి తీశాయో ఏంటీ.. అనేవిషయాలను ఎక్కువగా తన సినిమాలో చూపిస్తున్నట్లుగా వర్మ పేర్కొన్నాడు. వచ్చే నెలలోఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా వర్మ ప్రకటించాడు.

leave a reply