అంతరిక్షంలోకి.. స్పేస్ ఎలివేటర్‌!

స్పేస్ ఎలివేటర్‌ను నిర్మించాలంటే అంత సులభం కాదు.

మానవుడు తలుచుకుంటే ఏదైనా సాధ్యం అని మళ్ళీ నిరూపించండానికి జపాన్ కి చెందిన శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. వివరాలలోకి వెలితే ఇంతవరకు మనం అంతరిక్షంలోకి రాకెట్స్ ను పంపించడం చూసాం. కాని ఇప్పుడు  అంతరిక్షంలోకి మార్గం వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని కోసం స్పేస్ ఎలివేటర్‌ను ఉపయోగించి  అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి అవసరమైన మనుషులను, వస్తువులను,యంత్ర సామాగ్రిని సులభంగా అంతరిక్షానికి  చేరవేయవచ్చని అలాగే తిరిగి అంతరిక్షం నుండి భూమికి తీసుకొచ్చే పనికూడా సులభతరం అవుతుందని అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఖర్చుకూడా తగ్గవచ్చని భావిస్తున్నారు .

అయితే స్పేస్ఎలివేటర్‌ను నిర్మించాలంటే అంత సులభంకాదు. స్పేస్ ఎలివేటర్ నిర్మించాలంటే.. నేలపై నుంచి ఆకాశంలో భూస్థిర కక్ష్య దాకాఅంటే దాదాపు 20 వేల మైళ్ల ఎత్తుఫైదాకా ఒక రోప్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాని.. ఇది అంత సులభమైన పని కాదనితెలుసు. ఇందుకోసం పక్కా ప్రణాళిక, పకడ్బందీ సామాగ్రి చాలా అవసరం. భూమి నుంచి ఎత్తు పెరుగే కొద్దీ గురుత్వాకర్షణ శక్తి తగ్గుతూ ఉంటుంది. అలాగే అపకేంద్ర బలం కూడాఎక్కువ అవుతూ ఉంటుంది దీని ద్వారా ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి సులభతరంగాప్రవేశపెట్టొచ్చు. ప్రస్తుతం ఈ బృందం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సమీపంలో ఒకస్పేస్ ఎలివేటర్ నమూనాను పరీక్షిస్తుంది. అంతేకాకుండా అంతరిక్ష పరిశోధనలకు మూలకర్త అయినా సియాల్కో విస్కీ స్పేస్ ఎలివేటర్ల గురించి ఎప్పుడో ఊహించి చెప్పాడు. అయన ఒక  ఖచ్చితమైన బురుజు నిర్మాణం ఉహించి చెప్పాడు.అయన ఊహించిన నమూనా… భూమి మీద నుంచి 35,700 కిలోమీటర్ల పైగా ఉంటుందట. భూమి వ్యాసార్థం 6378 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి అలాంటి టవర్అగ్రభాగం జియోస్టేషనరీ కక్ష్యను తాకుతుందని చెప్పాడు.

leave a reply