టాప్ 10లో.. తెలుగు సినిమాలు..!

 ‘మహానటి ‘,’రంగస్థలం ‘ సినిమాలకు అరుదైన గౌరవం లబించించి.

ఈ సంవత్సరంలోవిడుదలైన తెలుగు సినిమాలు ‘మహానటి ‘,’రంగస్థలం ‘ సినిమాలకు అరుదైన గౌరవం లబించించి. మహానటి సావిత్రిగారి జీవిత కథ ఆధారంగా చిత్రీకరించబడిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన మరో చిత్రం రంగస్థలం రాంచరణ్ కెరీర్ లోనే విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది . ఐఎండీబీ (ఇంటర్నెట్‌ మూవీ డేటా బేస్‌)వారుతాజాగా విడుదల చేసిన 2018 సంవత్సరానికిగానూ టాప్-10 ఇండియన్ సినిమాల లిస్టులో నాలుగవ స్థానంలో మహానటి ఉండటం విశేషం రంగస్థలం సినిమాకు గాను ఏడవ స్థానం  దక్కింది. ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.

మహానటి చిత్రంను నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందించగా, సావిత్రిగారి పాత్రలో కీర్తి సురేష్ నటించారు. తదితర  పాత్రలలో సమంత, విజయ్‌ దేవరకొండ కీలక పాత్రలు పోషించారు. మోహన్‌బాబు,దుల్కర్‌ సల్మాన్‌,అవసరాల శ్రీనివాస్‌,ప్రకాశ్‌రాజ్‌, క్రిష్‌ జాగర్లమూడి, షాలిని పాండే, నాగచైతన్య అతిథి పాత్రల్లో నటించారు. ఈ లిస్టులో తమిళచిత్రాలు ‘రాట్చసన్’.. ’96’ కూడా చోటు సంపాదించాయి.

టాప్ 10 ఇండియన్ సినిమాలు  ఇవే:

  1. అంధాధున్‌ (హిందీ)
  2. రాక్షసన్‌ (తమిళం)
  3. 96 (తమిళం)
  4. మహానటి (తెలుగు)
  5. బధాయి హో (హిందీ)
  6. ప్యాడ్‌మ్యాన్‌ (హిందీ)
  7. రంగస్థలం (తెలుగు)
  8. స్త్రీ (హిందీ)
  9. రాజి (హిందీ)
  10. సంజు (హిందీ).

leave a reply