తెలుగువారి ఆరాధ్య నటుడైన నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘యన్టీఆర్’. టైటిల్ రోల్లో నటుడు బాలకృష్ణ నటించి అన్న ఎన్టీఆర్ను మెప్పించాడు. ‘యన్టీఆర్-కథానాయకుడు’ సినిమా విడుదలై అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా.. ఇప్పుడు ఆసక్తి అంతా ‘యన్టీఆర్ -మహానాయకుడు’ చిత్రం మీదే. అయితే.. యన్టీఆర్ బయోపిక్ రెండో భాగం ‘మహానాయకుడు’ రిలీజ్ డేట్ ఫిక్సయినట్టు చిత్ర యూనిట్ తెలిపారు.
తాజా సమాచారం ప్రకారం మహాశివరాత్రి కానుకగా రెండో భాగాన్ని విడుదల చేయనున్నారని తెలిసింది. ఫిబ్రవరి 28 లేదా మార్చి 1న కానీ రెండో భాగం రిలీజ్ కావచ్చని సమాచారం. వాస్తవానికి రెండవ భాగమయిన ‘మహానాయకుడు’ ఫిబ్రవరి 7న విడుదల చేయాలనుకున్నారు. అయితే.. కొన్ని కారణావల్ల విడుదల తేదీని వాయిదా వేశారు.