రానా చిత్రానికి దర్శకుల పాట్లు!

బాహుబలి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రానా ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళ భాషలలో చిత్రాలు చేస్తున్నాడు. అయితే ఆర్ధిక ఇబ్బందుల కారణంగా రానా దగ్గుబాటి సినిమా ఆగిపోయిందంటూ ఒక వార్త ప్రస్తుతం నెట్ లో హల్ చల్ చేస్తుంది. ‘బాహుబలి’ సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్‌గా ఎదిగిన రానా ప్రస్తుతం హిందీ, తమిళంలో భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్నాడు.

హిందీలో తెరకెక్కిస్తున్న ‘హాథీ మేరీ సాథీ’, ‘హౌస్‌ఫుల్ 4’ చిత్రాలలో రానా నటిస్తుండగా.. అటు తెలుగు, తమిళ్‌లో ఒకే సారి తెరకెక్కిస్తున్న‘1945’ చిత్రంలో నటిస్తున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల ‘హాథీ మేరీ సాథీ’ సినిమా షూటింగ్ నత్తనడకన సాగుతుందని సినిమా వర్గాల సమాచారం.. తాజాగా ‘1945’ సినిమా షూటింగ్ ఆగిపోయిందని, దీనికి కారణం ఆర్థిక లోటని తెలిసింది. కానీ, నిర్మాతలు ఆర్ధిక లోటును అధికమించే ప్రయత్నంలో ఉన్నారని.. నిధులు సమకూరిన తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం.

leave a reply