‘ఫ్రీక్‌ పిల్లా’ సాంగ్‌ పీక్స్‌

కన్నుగీటి కుర్రకారు మతిపోగోట్టిన మలయాళీ భామ ప్రియా వారియర్.. ‘ఒరు అడార్‌ లవ్‌’ సినిమా విడుదల కాకముందే ఓవర్‌ నైట్‌ స్టార్‌గా ఆమె స్టార్‌డమ్‌ పెరిగింది. కేవలం కన్నుగీటడటంతోనే ఆమె రాత్రికి రాత్రి స్టార్‌ అయిపోయింది. ఆ ఒక్క సీన్‌తో ఫుల్లుగా ఫేమస్ అయిన ప్రియా మరోసారి ‘ఒరు అడార్‌ లవ్‌’లోని ఓ సాంగ్‌లో తన హావభావాలతో కుర్రకారును మరోసారి కట్టిపడేసింది.

ఒమర్ లులు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఒరు ఆధార్ లవ్’ సినిమాను తెలుగులో ‘లవర్స్ డే’ పేరుతో విడుదల చేస్తున్నారు. మలయాళం, తెలుగు రెండు వెర్షన్లలో కూడా ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చిత్రానికి సంబంధించి ఇటీవలే జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అల్లు అర్జున్ హాజరై హుషారెత్తించిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రంలోని ‘ఫ్రీక్ పిల్ల’ ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు.

leave a reply