సర్వేపల్లి లో అనూహ్య మద్దతు లభిస్తోంది..సోమిరెడ్డి!

ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి రానున్న ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవరం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్దమవుతున్నాడు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి. ఈ విషయమై ఇదివరకే అధికారికంగా ప్రకటన కూడా వెల్లడైంది. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈ విషయం మాట్లాడినట్టు దానికి గాను చంద్రబాబు ఒప్పుకునట్టు తెలుస్తుంది.

ఈ సంధర్భంగా నెల్లూరు ఆదిత్యనగర్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని కలిసి సంఘీభావం తెలిపారు మనుబోలు, బిరదవోలు, విరువూరు తదితర గ్రామాల వైకాపా నాయకులు. 24న మనుబోలులో సభ నిర్వహించి పెద్దసంఖ్యలో కార్యకర్తలతో చేరుతామని మనుబోలు నేతల ప్రకటన చేశారు.

దీనికి గాను మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ సంతోషాన్ని తెలియజేస్తూ రాష్ట్రం లో జరుగుతున్నా అభివృద్ది కార్యక్రమాలను ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ ‘ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వచ్చాక సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. నాకు మద్దతు ప్రకటిస్తున్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ నా ధన్యవాదములు. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. రైతులకు అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చాం. రుణమాఫీ, ఇన్ పుట్ సబ్సిడీ, బిందు తుంపర్ల సేద్యానికి ప్రోత్సాహం, పంటల దిగుబడి విషయంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాం.

కేంద్ర ప్రభుత్వం ఐదెకరాల లోపున్న రైతు కుటుంబానికి మొక్కుబడిగా రూ.6 వేలు సాయం ప్రకటించింది..అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తాన్ని రూ.4 వేలు నుంచి రూ.9 వేలకు పెంచాం. ఈ ఫథకానికి 7 వేల కోట్లు అవసరమవుతుందని భావిస్తున్నాం. ఇప్పటికే బడ్జెట్ లో వ్యవసాయానికి 5 వేలు కోట్లు కేటాయించాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరాను 7 నుంచి 9 గంటలకు పెంచాం. వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధి రేటు 11శాతంతో దేశంలో అగ్రగామిగా ఉన్నాం. ఆక్వా విద్యుత్ చార్జీలను రూ.2కి తగ్గించి రైతుకు అండగా నిలిచాం…ఒక్క నెల్లూరు జిల్లాలోనే ఆక్వా రైతులపై రూ.850 కోట్లు భారం తగ్గింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందిగా ఉన్నా రైతుల విషయంలో రాజీ లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాలకు ప్రజలందరూ అండగా నిలవడం శుభపరిణామం అని ఆయన అన్నారు.

leave a reply