నా రూంలోకి రాగలవోమో, జీవితంలోకి రాలేవు

అక్కినేని యంగ్‌ కపుల్‌ పెళ్లైన తర్వాత కలిసి నటించిన మొదటి సినిమా ‘మజిలీ’. కాగా.. ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్‌ డే సందర్భంగా ‘మజిలీ’ టీజర్‌ను మూవీ టీం లాంచ్‌ చేశారు. నాగచైతన్య, సమంత జంటగా నటించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌ సినిమాను నిర్మిస్తోంది.

‘నీకో సంవత్సరం టైం ఇస్తున్నాను. ఈలోపు నువ్వు సచినే అవుతావో సోంబేరే అవుతావో నీ ఇష్టం’ అంటూ రావు రమేశ్‌ చెప్పే డైలాగ్‌తో, నాగచైతన్య క్రికెట్‌ ఆడుతున్న సన్నివేశంతో టీజర్‌ మొదలైంది. తర్వాత నాగచైతన్య, దివ్యాంశ కౌశిక్‌ ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత నాగచైతన్యకు సమంతతో పెళ్లి జరుగుతుంది. కానీ మొదట ప్రేమించిన అమ్మాయిని మరిచిపోలేక చైతూ సమంతను దూరం పెడతాడు. ‘నువ్వు నా రూంలోకి రాగలవేమో కానీ నా జీవితంలోకి రాలేవు’ అంటూ కోపంతో నాగచైతన్య సమంతతో అంటాడు. గోపీ సుందర్ ‌అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. ఏప్రిల్‌ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

leave a reply