ఎంతో.. ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌..!

విక్టరీ వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ ప్రధాన పాత్ర‌ల‌లో అనీల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న మాస్ అండ్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ ఎఫ్‌2 (ఫన్‌ అండ్‌ ఫస్ట్రేషన్‌). ఇందులో భాగంగా శ్రీమ‌ణి లిరిక్స్ అందించిన ఎంతో ఫ‌న్ అనే లిరిక‌ల్ సాంగ్‌ని విడుద‌ల చేశారు. డీఎస్పీ పాడిన ఈ పాట సంగీత ప్రియుల‌ని అల‌రిస్తుంది.

కాగా.. దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రంలో వెంకీ స‌ర‌స‌న త‌మ‌న్నా, వ‌రుణ్ తేజ్‌తో మెహ‌రీన్ జ‌త‌క‌ట్టారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. వెంకీ, వరుణ్ తోడళ్లుళ్లుగా కనిపించనున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించ‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని అంటున్నారు. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ని వేగ‌వంతం చేశారు.

leave a reply