థ్రిల్లర్‌ కళ్యాణ్‌ రామ్‌ ‘118’ ట్రైలర్‌ లాంచ్‌

ప్రస్తుతానికి నువ్వు డ్రీం గర్ల్‌వి ఏమో.. కానీ వాడి డ్రీమ్‌ గర్ల్‌ వేరే ఉందంటూ ట్రైలర్‌ స్టార్ట్‌ అవుతుంది. ఎవరో ఒక లేని అమ్మాయి కోసం కళ్యాణ్‌ రామ్‌ వెతుకుతూ కనిపిస్తూంటాడు. ఆమె ఫొటోను చూపించి ఎవర్ని అడిగినా తెలీదనే ఆన్సర్‌నే ఎదురవుతుంది. ‘స్టార్ట్‌ చేసింది ఏదైనా సగంలో ఆపాలంటే చిన్నప్పటి నుంచి నాకు చెడ్డ చికాకు.. ఏంటో వెధవ క్యూరియాసిటీ’ అని లాస్ట్‌ డైలాగ్‌తో ట్రైలర్‌ ఎండ్‌ అవుతుంది. ట్రైలర్‌ను చూస్తే, సినిమాను క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. గతంలో కల్యాణ్‌రామ్‌ ఎప్పుడూ చేయని సరికొత్త పాత్రలో కనిపించారు.

థ్రిల్లర్‌ కథాంశంగా.. హీరో కల్యాణ్‌ రామ్‌ చేస్తున్న చిత్రం ‘118’. ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా ఈ మూవీ యూనిట్‌ టీం లాంచ్‌ చేశారు. ఈ సినిమాలో షాలినీ పాండే, నివేదా థామస్‌ హీరోయిన్స్‌. ఈ సినిమాకి కేవీ గుహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ యూనిట్‌ టీం థియేట్రికల్‌ ట్రైలర్‌ను లాంచ్‌ చేశారు.

leave a reply