ఎన్టీఆర్ కి స్టెరాయిడ్స్ ఇచ్చారు..! లక్ష్మీస్ ఎన్టీఆర్ 25 శాతమే వాస్తవం..!

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పై ఎన్టీఆర్ సతీమణి బసవతారకం సన్నిహితురాలైన డాక్టర్ కుసుమా రావు సంచలనమైన కామ్నెట్స్ చేశారు. తాజాగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె కొన్ని ఆసక్తికర విషయాలని ఆమె వెల్లడించారు. ఎన్టీఆర్‌ది నూటికి నూరు పాళ్లు సహజ మరణం కాదని కుసుమా రావు తెలిపారు. ఎన్టీఆర్‌ వద్ద సాన్నిహిత్యం పెంచుకున్న లక్ష్మీ పార్వతి పార్టీపై, పాలనపై పెత్తనం చెలాయించాలని చూశారని తెలిపారు. ఆమె ‘కిచెన్ క్యాబినెట్’ నడిపారని ఆరోపించారు.

ఎన్టీఆర్ బౌతికకాయాన్ని తొలుత ఆమె చూసినట్లు తెలిపారు. ఆ సమయం లో అన్నగారి ముఖం చాలా ఉబ్బిపోయిందని కళ్ళు కూడా బయటకి వచ్చాయని ఆమె చెప్పారు. ఎన్టీఆర్ మొహం నల్లగా మారిపోయిందని తెలిపారు. ఏదో జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌కు మగతనాన్ని పెంచే స్టెరాయిడ్స్ ఎక్కువగా ఇచ్చినట్లు మెడికల్ సర్కిల్స్‌లో చర్చ జరిగేదని డాక్టర్ కుసుమ చెప్పారు. ఎన్టీఆర్ ద్వారా లక్ష్మీ పార్వతి పిల్లలను కనాలని చూశారని.. ఈ క్రమంలో హార్మోన్ల కోసం స్టెరాయిడ్స్ వాడారని తెలిపారు. ఆ ఫలితమే ఆయన మరణానికి కారణం అయ్యుంతుందని ఆమె స్పష్టం చేశారు.

ఇవన్నీ తెలిసి కూడా నేను ఈ విషయమై ఎవ్వరినీ ఎందుకు అడగలేదో నాకు ఇప్పటికీ అర్ధం కాదని ఆమె అన్నారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు. ఫ్యామిలీ డాక్టర్లు ఉన్నారు.. కార్డియాలజిస్ట్ ఉన్నారు. ఎవరినీ వివరాలు అడిగే ప్రయత్నాలు ఎందుకు జరగలేదో నాకిప్పటికే సందేహమే..’ అని కుసుమా రావు అన్నారు.

వాస్తవానికి ఎన్టీఆర్ రాత్రి 10.30, 11 గంటల మధ్యే కన్ను మూసినట్లు వార్తలు వచ్చాయని.. కానీ, అర్ధరాత్రి తర్వాత మరణించినట్లు చెప్పారని ఆమె తెలిపారు. ఎన్టీఆర్‌ను చూసుకుంటున్నారనే కారణంతో ఇంట్లో వాళ్లు కూడా ఆమెకు ఎదురు చెప్పలేదని వివరించారు. ఇదే అదనుగా పార్టీలో, ప్రభుత్వంలో ఆమె కల్పించుకున్నారని చెప్పుకొచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో చూపించినవన్నీ నిజాలు కావని కుసుమా రావు చెప్పారు. అన్నగారికి వీరాభిమానినని చెప్పిన కుసుమా రావు.. లక్ష్మీ పార్వతిపై విమర్శల వర్షం కురిపించారు. సినిమాలో 25 శాతం వాస్తవాలు ఉండొచ్చని వ్యాఖ్యానించారు.

leave a reply