న్యూయర్‌ విషెస్‌ తెలిపిన `ఎన్టీఆర్‌ కుటుంబం’..

ఎన్టీఆర్ బయోపిక్‌లో మొదటిభాగమైన ‘కథానాయకుడు’ విడుదలకి ముస్తాబవుతోన్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ శ్రీమతి బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించారు. కాగా.. ఈ రోజు బసవతారకం అలియాస్‌ విద్యాబాలన్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ బసవతారకం లుక్‌తో వున్న విద్యాబాలన్ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. “వెండితెర తారకమ్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. దివిలోని తారకరాముల తరఫున.. భువి పైన తెలుగువారందరి తరఫున ..” అంటూ క్రిష్ ట్వీట్ చేశారు.

అంతేకాకుండా.. తెలుగు ప్రేక్షకులందరికీ న్యూయర్‌ విషెస్‌ తెలుపుతూ మరో పోస్టర్‌ను ఈ మూవీ టీమ్‌ విడుదల చేశారు. ఇప్పటికే ఈ బయోపిక్‌పై అంచనాలు ఒక రేంజ్‌లో పెరిగిపోయాయి. జనవరి 9న ఈ సినిమా విడుదలకానుంది.

leave a reply