‘ఫిబ్రవరి 14’ నాకు ఇష్టమైన రోజు

‘ఒరు అడార్ లవ్‌’ మూవీ ఆడియో లాంచ్‌లో అల్లు అర్జున్‌ సందడి చేశారు. మలయాళీ భామ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ కథానాయికగా నటించిన ‘ఒరు అడార్ లవ్‌’ చిత్రం తెలుగులో ‘లవర్స్‌ డే’ టైటిల్‌తో విడుదల కాబోతోంది. ఈ చిత్ర ఆడియో విడుదల‌ వేడుకను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ ఆడియో లాంచ్‌కి అల్లు అర్జున్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో ప్రియా ప్రకాశ్‌ కన్నుకొట్టిన వీడియో చాలా వైరల్‌ అయిందని అన్నారు. ఫిబ్రవరి 14నే ‘లవర్స్‌ డే’ తెలుగులో రిలీజ్‌ చేస్తుండటం సంతోషంగా ఉందన్నారు. అలాగే ప్రొడ్యూసర్‌ వినోద్‌ నాకు పెద్ద అభిమాని అని తెలుసు. అందుకే ఆయన పిలవగానే నేను వచ్చాను.

కాగా.. నాకూ ‘లవర్స్‌ డే’ అంటే చాలా ఇష్టమని నా బర్త్‌ డే సెలెబ్రేషన్స్‌ లాగానే లవర్స్‌ డేను కూడా సెలెబ్రేట్‌ చేసుకుంటా అన్నారు. ఈ సారి మా వైఫ్‌కి ఏ గిప్ట్‌ ఇవ్వాలో ఆలోచిస్తున్నా అని తెలిపారు. అలాగే నాకు సౌతిండియా అంటే చాలా ఇష్టమని తెలిపారు. ఇక్కడ కూడా ఫ్యాన్స్‌ ఉండటం చాలా హ్యీపీగా ఉందని అన్నారు. అలాగే.. ఈ ఆడియో లాంచ్‌ బన్నీ కూడా కన్నుకొట్టి గన్‌షూట్‌ పేల్చిన సన్నివేశాన్ని అనుకరించారు. బన్నీ కన్నుకొడుతున్నప్పుడు తీసిన వీడియోను ఓ అభిమాని ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతో అది కాస్తా వైరల్‌ అవుతోంది.

leave a reply