ఎఫ్2 12 డేస్…రికార్డ్స్!

సంక్రాంతి బరిలో స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ – మెగా హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘F2’ జనవరి 12న ప్రేక్షకుల ముందు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.  సంక్రాంతి సీజన్లో చివరగా రిలీజ్ అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను మించి కలెక్షన్స్ వసూలు చేసింది.  పండగ సీజన్లో ప్రేక్షకులు కోరుకునే ఎంటర్టైన్మెంట్ ఉండడం.. పైగా పోటీలో ఉన్న ఇతర సినిమాలకు పెద్దగా ఆదరణ దక్కకపోవడం తో వెంకీ – వరుణ్ సినిమాకు మంచి కలెక్షన్ వచ్చింది.

ఈ చిత్రం విడుదలైన అయిన పన్నెండు రోజులకుగాను తెలుగు రాష్ట్రాలలో 50 కోట్ల రూపాయలకు పైగా షేర్ సాధించింది.  ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫీట్ సాధించిన సినిమాలలో ఇది “F2” వచ్చి చేరింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ వ్యాల్యూ రూ. 34.50  కోట్లు మాత్రమే. పెట్టుబడితో చూసుకుంటే ఇప్పటికే ఈ సినిమా రైట్స్ తీసుకున్న బయ్యర్లందరికి సంక్రాంతికి మంచి జాక్ పాట్ అని చెప్పొచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో F2 ఏరియావైజ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజామ్: 17.30  cr  

సీడెడ్: 6.53 cr

ఉత్తరాంధ్ర: 7.70 cr

కృష్ణ: 4.16 cr

గుంటూరు: 4.25 cr

ఈస్ట్ : 5.76 cr

వెస్ట్: 3.29 cr           

నెల్లూరు: 1.52 cr

టోటల్: రూ. 50.48 cr

leave a reply