కేజీఎఫ్…రికార్డ్స్

కేజీఎఫ్:డబ్బింగ్ సినిమా ‘కేజీఎఫ్’ మూడో వారంలో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ కలెక్షన్స్ సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.  పోటీ అనేదే లేకుండా ఉండడం కేజీఎఫ్ కు బాగా కలిసి వచ్చింది.  ఒక కన్నడ సినిమా మూడో వారంలో ఇలా వసూళ్ళు సాధించడం మాత్రం చాలా గొప్ప విషయమే.

తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారంలోనే ఐదు కోట్లకుపైగా షేర్ సాధించిన ‘కేజీఫ్’ 17 రోజులకు గానూ రూ.10.29 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించింది. ఈ సినిమా గ్రాస్ కలెక్షన్స్ 20 కోట్ల రూపాయల మార్కుకు దగ్గరలో ఉన్నాయి.   ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ. 5 కోట్లకు వారాహి చలన చిత్రం వారు తీసుకున్నారని టాక్.  ఈలెక్కన సాయి కొర్రపాటికి కోలార్ గోల్డ్ మైన్స్ లో బంగారం దొరికినట్టే.  ఈమధ్య పెద్దగా సక్సెస్ లేకుండా ఇబ్బంది పడుతున్న ఆయనకు ఈ సినిమాతో పెద్ద రిలీఫ్ వచ్చినట్టే. ‘కేజీఎఫ్’ ఏపీ.. తెలంగాణా రాష్ట్రాలలో సాధించిన ఏరియా వైజ్ కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

నైజామ్: 4.13 cr

సీడెడ్: 1.96 cr

ఉత్తరాంధ్ర: 1.19 cr

ఈస్ట్ : 0.62 cr

వెస్ట్: 0.48 cr

కృష్ణ: 0.90  cr

గుంటూరు: 0.75 cr

నెల్లూరు: 0.26 cr

ఏపీ + తెలంగాణా: రూ. 10.29 cr (డిస్ట్రిబ్యూటర్ షేర్)

leave a reply