ఏభాషలో అయినా…టైప్‌కు గుడ్‌బై!

టైప్ చేయవలసిన అవసరం లేదు మాట్లాడితే చాలు అక్షరాలు ప్రత్యక్షం అవుతాయట.. వాట్సప్‌లో ఉండే గూగుల్‌ (జి) కీబోర్డును ఉపయోగించి ఇంగ్లీష్‌ మాత్రమే కాకుండా ఇతర స్థానిక భాషలలో కూడా టైప్‌ చేయకుండా అక్షరాలు స్ర్కీన్‌పై చూసుకునే సదుపాయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. అయితే ఇంతక ముందే ఈ సౌకర్యం అందుబాటులో ఉన్నప్పటికీ వాట్సప్‌ 2.9.11 అప్‌డేట్‌లో వినియోగదారులకు మరింత సులభంగా దీనిని చేసారు. ఇది అండ్రాయిడ్‌, ఐఔస్‌ ఫోన్‌ల వాడకందారులకు అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. దీనిని వాడటానికి మొదట వాట్సప్‌లో కాంటాక్ట్‌ పర్సన్‌ లేదా గ్రూప్‌ను సెలెక్ట్‌ చేసుకోవాలి. అనంతరం వాట్సప్‌ కీబోర్డులో పై వైపున కుడిభాగంలో ఉండే గ్రీన్‌ కలర్‌ మైక్‌ దిగువ భాగాన ఉండే బ్లాక్‌ కలర్‌ మైక్‌ను ఉపయోగించి ఈ సౌకర్యాన్ని వాడుకోవచ్చు.

దీనిని నోటి మాటల ద్వారా టైప్ చేయాలనుకున్న సమాచారాన్ని మైక్‌కు డిక్టేట్‌ చేయాలి. వెంటనే కళ్లముందు ఆ అక్షరాలన్నీ వాటంతట అవే టైప్‌ అయి కనిపిస్తాయి. సెట్టింగ్స్‌లో తగినవిధంగా కావలసిన భాషను మార్చుకుంటే చేసుకుంటే తెలుగుతో సహా కొన్ని ఇతర భాషలలో ఈ అక్షరాలు కనిపిస్తాయి. టైప్‌ చేయడం తెలియని వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కీబోర్డ్‌ పై వైపున గ్రీన్‌ కలర్‌లో ఉండే మైక్‌ను సాధారణంగా వాయిస్‌ మెసేజ్‌లకు మాత్రమే వాడుతుంటారు. ఆ మైక్‌ దిగువ భాగాన ఉండే బ్లాక్‌ కలర్‌ మైక్‌తో మాత్రమే డిక్టేషన్‌కు వీలవుతుంది. మైక్‌ ముందు చదివేటప్పుడు ఎటువంటి తడబాటు లేకుండా చదివితే అక్షరం తప్పు లేకుండా అక్షరాలు టైప్‌ అయి కనిపిస్తాయి. టెక్నాలజీలో కొత్త పుంతలు తొక్కుతున్న కృత్రిమ మేధస్సుతో ఇవి సాధ్యమవుతున్నాయి.

leave a reply